Viluva Quotes in Telugu | Value Quotes | Telugu Value Quotes | Best Quotations on Value which is Viluva.
జీవితం యొక్క విలువను తెలుసుకోనివాడు, ఒక్క గంట సమయాన్ని వృధా చేయడానికి ధైర్యం చేస్తాడు.
విజయం సాధించాలని కాకుండా, విలువైన వ్యక్తిగా మారడానికి ప్రయత్నించండి.
సామాన్య వస్తువుల విలువలు మీకు తెలిసి ఉండవచ్చు, కానీ మీ ఆత్మ విలువ మీకు తెలియకపోతే, అన్నీ వృథా.
నమ్మకం అనేది ఒక చిన్న పదం. దీనిని చదవడానికి ఒక సెకెండ్ పడుతుంది.. ఆలోచించడానికి ఒక నిమిషం పడుతుంది.. అర్ధం చేసుకోడానికి ఒక రోజు పడుతుంది.. కాని నిరూపించు కోడానికి ఒక జీవిత కాలం కావాలి..
నమ్మకం అనేది ఒక చిన్న పదం. దీనిని చదవడానికి ఒక సెకెండ్ పడుతుంది.. ఆలోచించడానికి ఒక నిమిషం పడుతుంది.. అర్ధం చేసుకోడానికి ఒక రోజు పడుతుంది.. కాని నిరూపించు కోడానికి ఒక జీవిత కాలం కావాలి..
చదువు పాఠం నేర్పి పరీక్ష పెడుతుంది కానీ జీవితం పరీక్ష పెట్టి పాఠం నేర్పుతుంది.
దేవుడు పక్షులకు ఆహారాన్ని సమృద్ధిగానే ఇచ్చాడు కానీ వాటి గూటిలో మాత్రం తెచ్చిపెట్టలేదు పక్షులే వెతుక్కుని సంపాదించుకుంటాయి అలానే పనిలో విజయం కావాలంటే తానున్న చోటికి రాదు మనం శ్రమిస్తూ పోవాల్సిందే.
తల్లిగర్భంలో ఉన్న శిశువు కూడా రోజురోజుకు ఎదగడానికి బయటకు రావడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది.. కానీ బయట ఉన్న మనిషి మాత్రం అసూయా, ద్వేషాల నుంచి జీవితమంతా ముగిసిపోతున్నా బయటకు రాలేకపోతున్నాడు.
జీవితం అంటే.. ఏంటో తెలియని వాళ్ళకు అనుభవాల రూపంలో అస్సలు జీవితం అంటే ఇదేననీ తెలుస్తుంది.!!
ఈ ప్రపంచంలో బతకాలి అంటే మంచితనం, మొండితనం రెండూ ఉండాలి మంచితనం మనుషుల మీద చూపించాలి “మొండితనం” పరిస్థితుల మీద చూపించాలి ఎవ్వరి నుంచి ఏదీ ఆశించకు అది నీ ఆనందాన్ని చంపేస్తుంది.
విజయం గొప్పది కాదు. సాధించిన వాడు గొప్ప. బాధ పడటం గొప్ప కాదు.. బాధను తట్టుకునే వాడు గొప్ప. భాంధవ్యాలు గొప్ప కాదు. వాటిని నిలబెట్టుకునే వాడు గొప్పు.
ఎవరు ఎంత బాధపెట్టినా నెనే సర్దుకుపోతాను, ఎందుకంటే తగ్గి ఉండటం నాకు అలవాటు కాబట్టి, ఎందుకంటే బంధాలకు విలువ ఇస్తాను కాబట్టి సర్దుకొని.
కాలమేప్పుడు ఒకే చోట ఆగదు జీవితమేప్పుడు ఒకె లా ఉండదు.
ఒకరికి మంచివాళ్ళం… ఇంకొకరికి చెడ్డవాళ్ళం… ఒకరికి ఏమీ కాము…. మరొకరికి అన్నీ మనమే… అదే జీవితం.
జీవిత కాలం సరిపోదు జీవితం తెలుసుకోవడానికి క్షణ కాలం సరిపోదు జీవితం ముగియడానికి.
జీవితమే శాశ్వతం కానప్పుడు మధ్యలో పరిచయమయ్యే ఈ బంధాలు శాశ్వతంగా ఎలా ఉంటాయి.
మీకు నచ్చినా, నచ్చకపోయినా మనం బ్రతికి ఉన్నంతకాలం బాధ మన జీవితంలో ఒక భాగం.