అవసరాన్ని బట్టే మనుషులు … ఎప్పుడైతే మన అవసరం తీరిపోతుందో …మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది … The most selfish living being on earth is HUMAN.
ప్రపంచంలో ప్రతి ఒక్కడు స్వార్థపరుడే ఇదే ఎవరితోనైనా చెప్తే ఏనా కొడుకు ఒప్పుకోడు.
ఓసారి క్రింద పడి చూడు.. నిన్నెత్తడానికి ఒకచేయి కూడా ముందుకు రాదు.. ఓసారి పైకి ఎగిరి చూడు.. లాగి దించేయడానికి వందల చేతులు ముందుకొస్తాయి.
ప్రతి మనిషి స్వార్థ పరుడే.. కాని అందరికీ నిస్వార్థంగా ఉండాలని చెప్తుంటాడు..
ఈ ప్రపంచమంతా అవకాశవాదులతోనే నిండి ఉంది..!! ఎవరు ఏ క్షణాన ఎలా ప్రవర్తిస్తారో తెలియదు అందుకే అనుక్షణం అప్రమత్తంగా ఉంటే మంచిది.!!
ఎదిగిన వాడి పరిచయం కోసం ఎగబడతారు మనకు పరిచయం ఉన్నవాడు ఎదిగితే తట్టుకోలేరు.
ఆకలి, ఆపద, అవసరం ఈ మూడే మనిషి అడ్డదారులు తొక్కడానికి కారణం.
ఇ సమాజం లో ప్రతిసారి నిష్వర్థంగా ఉంటె ఈ సమాజం మిమ్మల్ని ముంచేస్తుంది అందుకని స్వార్థపరులుగా ఉండండీ మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు.
ఒకప్పుడు ప్రేమను చూసి బంధాలు కలుపుకునేవారు కానీ ఇప్పుడు డబ్బును చూసి బంధాలు కలుపుకుంటున్నారు.
నీ స్వార్థం వల్ల మరొకరికి అన్యాయం జరుగుతుందన్నప్పుడు నువ్వు నీ స్వార్థాన్ని వేళ్ళతో సహా పెకిలించి పడేయ్..!!
ఇక్కడ అవసరాలకోసం.. వాడుకునేవారు తప్ప.. మన అనుకునేవారు ఎవరు లేరు ఈరోజుల్లో ఎవరి.. స్వార్థం వాళ్లు చుసుకుంటున్నారు..!!
నేటి సమాజం, హమ్మయ్య ఆ రంద్రం మనవైపు పడలేదు.
మనుషులను నమ్మాలంటే భయంగా ఉంది మోసం చేస్తారని కాదు.. క్షణానికి ఒక్కోలా మారిపోతారని.
ఈ కాలంలో మనిషి మరో మనిషితో మాట్లాడటానికి రెండే కారణాలు అవసరం, టైంపాస్.
దూరం దూరంగా నాటిన మొక్కలు కూడా అవి పెరిగేకొద్ది దగ్గరవుతాయి.. కానీ మనుషులు పెరిగే కొద్ది దూరమవుతున్నారు.
ఒకరోజు పిల్ల చేప.. తల్లి చేపను అడిగింది.. ఎందుకమ్మా.. మనం భూమ్మీద బతకలేం.. అప్పుడు తల్లి చేప ఇలా చెప్పింది.. భూమ్మీద Selfishలకే తప్ప.. మనలాంటి Fishలకు చోటు లేదమ్మా.. అని..!!
నువ్వు నన్ను ఏమైనా అనాలి అనుకుంటే, ముందు నువ్వు నన్ను అందుకోవాలి.
ఎదుటి వారిలా బ్రతికేంత ధనం నాదగ్గర లేకపోవచ్చు కానీ, నాలా నేను బ్రతికేంత ధైర్యం నాలో ఉంది…
ఎదుటి వారిని నిందించడంలో ఉన్న శ్రద్ధ అర్థం చేసుకోవడంలో ఉండదు చాలామందికి!
చదువు అందం డబ్బు. అన్నీ చూసుకొని ప్రేమిస్తారు (స్వార్ధం). పేదింటి పిల్లని, ఎవరూ ప్రేమించరు.
మితిమీరిన నమ్మకం చాల ప్రమాదం, నమ్మకం ఎంత బలపడితే ద్రోహం అంత గట్టిగా తగులుతుంది.
ఎవర్నీ ఎక్కువ ఇష్టపడద్దు.. బాద పడతావు.
నువ్వు, ఎవరికైతే సహాయం చేస్తావో. వాళ్లే నీకు మోసం చేస్తారు.