నువ్వు ఎవరికైతే సహాయం చేస్తావో. వాళ్లే నీకు మోసం చేస్తారు.
పుట్టిన దగ్గర నుండి వెనకే తిరుగుతున్న నీడను ఈ రోజు అడిగేసా… ఎందుకు నన్ను అంటిపెట్టుకుని ఉన్నావు అని …?? అప్పుడు నవ్వుతూ నాతో ఇలా చెప్పింది… నీకు నేను తప్పా ఇంకెవరు ఉన్నన్ని …
నా వల్ల ఒకరికి ఇబ్బంది కలుగుతుంది అని తెలిస్తే నాకు ఎంత కష్టం అయినా సరే వారికి దూరంగా ఉంటా. ఎందుకంటే నా సంతోషంలో నేను ఓడిపోయినా వారి సంతోషంలో నేను కచ్చితంగా గెలుస్తా..
జీవితంలో మీరు ఎవరినైనా ఒక్కసారైనా హద్దులు మించి ప్రేమిస్తే.. ఆ ప్రేమ మిమ్మల్ని జీవితాంతం ఏడిపిస్తూనే ఉంటుంది.
మోసం చేసేవారికి మోసం అనిపించదు. మోసపోయేవారికి మాత్రమే ఆ బాధ తెలుస్తుంది… జీవితంలో ఎవ్వరిన్నీ మోసం చేయొద్దు…
నమ్మకం అనే చిన్ని విత్తనం లేకుండా “ఇష్టం”, “స్నేహం”,”ప్రేమ” ఏ బంధమూ మొలకెత్తదు మానుగా మారదు…
చిన్నప్పుడు స్కూల్లో, వక్తృత్వ పోటీలప్పుడు స్టేజిపై మాట్లాడుతూ ధనం కంటే గుణం, చదువు గొప్పదని అన్నాను. ఆ విషయం డబ్బు మనసులో పెట్టేసుకుని ఉన్నట్టుంది. ఎంత సంపాదించినా ఎలా ఖర్చయిపోతుందో తెలియకుండానే అయిపోతుంది.
నీ దగ్గర ఏదైతే ఉందో దానిని దేవుడు ఇచ్చాడని సంతోషంగా ఉండు నీ దగ్గర ఏదైతే లేదో దానిని దేవుడు ఇస్తాడని నమ్మకంతో ఉండు..!!
మీరు ఒక పనిని చేయగలను అని నమ్మితే సగం పని పూర్తయినట్లే..
ఒకసారి పోతే మళ్లీ తిరిగిరావు.. బతకడం గొప్ప కాదు.. నిజాయితీగా బతకడం గొప్ప..!