Money Quotes in Telugu | డబ్బు ఎవరికీ ఊరికే రావు

మనసు ఎవ్వరికి కావాలి అందరికి money నే కావాలి.

 

నీ దగ్గర మాట, మంచి, మర్యాద ఎంతున్నా, డబ్బు లేకపోతే నా అనుకున్న నీ వాళ్ళే ఆమడ దూరంలో ఉంటారు.

 

మనం అంటే నచ్చని వాళ్ళకి కూడా మనల్ని ఇష్టపడేలా చేసే సత్తా డబ్బుకి మాత్రమే ఉంది.

 

నీలో ఎంత మంచితనం ఉన్నా డబ్బు లేని నువ్వు ఎవరికీ నచ్చవు.

 

డబ్బుని ఎంత నలిపినా ఏ మాత్రం తగ్గదు. మనం మంచివాళ్లం అయితే ఎవరు ఎన్ని నిందలు వేసినా మన value తగ్గదు.

 

పైసలు లేకపోతే ఏ నా కొడుకు రాడు మన దగ్గరికి మనకి సపోర్ట్ చేయడు పైసలు ఉంటే తప్పు చేసిన మన దగ్గరికి వస్తాడు సపోర్ట్ చేస్తాడు.

 

డబ్బు ఇద్దరు మనుషుల్ని విడదీస్తుంది అంటారు కానీ కాదు, డబ్బు ఇద్దరి వారి నిజస్వరూపాన్ని బయటపెడుతుంది అంతే..!

 

డబ్బును సంపాదించడానికి మాత్రమే జీవించకు! నువ్వు చనిపోయాక నిన్ను తీసుకుని వెళ్ళే “యముడు” నువ్విచ్చే లంచాన్ని తీసుకోడు కాస్త మంచిని పంచు నేస్తమా!

 

డబ్బు అసలైన విలువ ఒకరి వద్ద అప్పు అడిగేటప్పుడే తెలిసొస్తుంది. This is true.

 

డబ్బుని ఎంత నలిపిన దాని విలువ ఏ మాత్రం తగ్గదు… మనం మంచోళ్ళం అయితే ఎవరు ఎన్ని నిందలు వేసిన మన విలువ తగ్గదు….!!

 

మనుషుల గురించి తెలుసుకోవాలంటే money లేకుండా బ్రతికి చూడు. అన్నీ సంబంధాలు వాటంతట అవే బయటపడతాయి.

 

నువ్వు ఎన్నైనా చెప్పు.. ” డబ్బు” తర్వాతే అన్ని..!!

 

నాన్న ఎప్పుడూ చెప్తూ ఉంటాడు నువ్వు ఎంత పిసినారి అయినా తిండి విషయంలో డబ్బు గురించి ఆలోచించకు అని.

 

పేద, ధనిక చూడదు ప్రేమ చిన్న, పెద్ద పట్టించుకోదు స్నేహం కానీ.. ఏ బంధాన్నైనా తెంచగలదు డబ్బు.

 

అతి పెద్ద జబ్బు అతి పెద్ద బలహీనత డబ్బు లేకపోవటం అతి పెద్ద ధైర్యం అతి పెద్ద బలం డబ్బు ఉండటం.

 

డబ్బు ఉంటేనే ప్రేమ ఎందుకంటే అమ్మాయి కలలోకి రాజు కుమారుడు వస్తాడు కానీ కులోడు రాడు…!

 

అప్పు ఇవ్వడం వల్ల డబ్బయినా పోగొట్టుకుంటావు, శత్రువునైనా సంపాదించుకుంటావు.

 

కొన్ని వేల మాటలు ఇవ్వలేని ధైర్యం ఒక్క కరెన్సీ నోటు ఇస్తుంది.

 

డబ్బు మనిషికి బలాన్నిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది.. కానీ ఎంత సంపాదించినా సంతృప్తి మాత్రం ఇవ్వలేదు.

 

డబ్బు మనిషిని మార్చదు, మనిషి నిజ స్వరూపాన్ని బయటపెడుతుంది.

 

జీవితంలో కొన్ని కోల్పోవడం సహజం కానీ జీవితాన్ని కోల్పోకండి. ఈరోజు డబ్బు లేనిదే జీవితం లేదు, డబ్బు చూసి మర్యాద పుడుతుంది. జాగ్రత్త మిత్రమా…….

 

డబ్బు కష్టం వస్తే తీర్చగలదేమో కానీ బాధ కలిగితే ఓదార్చలేదు..!

 

డబ్బుతో మనిషి స్థాయిని నిర్దేశించడం మన పేదరికానికి చిరునామా !!

 

ఎన్ని చేతులు మారినా సెకండ్ హ్యాండ్ అని పిలవనిది ఏదైనా ఉంది అంటే అది కేవలం డబ్బు మాత్రమే.

 

ఒక మనిషికి డబ్బు ఎంతైనా ఉండవచ్చు. కానీ ఎదుటి మనిషిని చులకనగా చూసే జబ్బు ఉండకూడదు..!

 

Leave a Reply