Manishi Viluva quotes in Telugu

మన వెనుక మన గురించి తప్పుగా మాట్లాడుకునే వారి గురించి ఆలోచించకండి ఎందుకంటే వారి స్థానం ఎప్పుడూ మన వెనుకే మంచి కోసం మనిషి మారాలి కానీ అవసరాల కోసం మనిషి తన రంగులు మార్చకూడదు.

 

ఆల్చిప్పలో ముత్యం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో……నా మదిలో నీ రూపం అంత పదిలంగా ఉంటుంది.

 

జీవితంలో ” కష్టం “అనేది లేకపోతే
“సుఖం “విలువ తెలియదు..
“కోపం ” అనేది లేకపోతే
“ప్రేమ “విలువ తెలియదు!!

 

బంగారానికైనా వెల తగ్గుతుందేమో కానీ…! మనిషిలోని మంచితనానికి ఎప్పటికీ విలువ తగ్గదు…!!

 

చేతిలోని ధనం నోటిమాట రెండూ విలువైనవే..! వాటిని పొదుపుగా వాడితేనే మనిషికి విలువ..!!

Also Read: Viluva Quotes in Telugu

ఏ బాధకో బానిసని
ఏ భయానికో శత్రువుని
ఏ ప్రేమకో అందని ఆకాశాన్ని
ఏ చిరున్వవ్వు కురవని ఎడారిని
ఏ బంధానికో
దగ్గరకాలేని బతికున్న శవాన్ని

 

ఎవరి విలువ ఏంటో time వచ్చినప్పుడే తెలుస్తుంది..!!

 

దేవుడు కనబడితే దండం పెట్టినా పెట్టకపోయినా పేదోడు కనబడితే అన్నం పెట్టండి.. అదే మానవత్వం..!

 

కష్టపడితే తెలుస్తుంది బ్రతుకు విలువ.. దూరమైతే తెలుస్తుంది మనిషి విలువ.

 

అందరికీ నీ విలువ తెలియాల్సిన అవసరం లేదు.., నువ్వు కావాలి అనుకున్న వారికి నువ్వేంటో తెలిస్తే చాలు…

 

గౌరవం, ప్రేమ, స్నేహం ఇవి బిక్షగా అడుక్కునేవి కావు..
మనం నచ్చి, మనల్ని మెచ్చి వాటంతట అవి మన దరికి రావాలి.
అపుడే మనకు విలువ..

 

ఏ వస్తువైనా.. బంధమైనా రెండుసార్లు మాత్రమే… అందంగా కనిపిస్తుంది ఒకటి దొరికినప్పుడు.. రెండోది పోగొట్టుకున్నప్పుడు… ఎందుకంటే ఉన్నప్పుడు దాని విలువ తెలియదు… లేనప్పుడు ఎంత ఆరాటపడ్డా దొరకదు.

Leave a Reply