ఎదురించి పోరాడే .. “శత్రువు” కన్నా నమ్మించి నట్టేట్లో ముంచే, “రక్త సంబంధీకులే” చాలా ప్రమాదకరం..
నువ్వు చేరదీసిన వాళ్లంతా… నిన్ను ఆరాధిస్తారని అనుకోకు.. వాళ్ల అవసరం తీరిన రోజు నిన్ను పక్కన పెట్టేస్తారు..
నిజం “సర్జరీ” లాంటిది.. ముందు బాధ పెట్టినా, పూర్తిగా నయం చేస్తుంది.. అబద్దం “పెయిన్ కిల్లర్’ లాంటిది.. వెంటనే నయం చేసినా, తరువాత నాశనం చేస్తుంది..
నిజాయితీగా ఉన్నాను అంటూ మూగవాడిగా ఉండిపోకు.. నిజంగానే అవిటివాడిని చేసేస్తుంది ఈ లోకం..
నీ అంతిమ యాత్రలో, శ్రీ నీ వెంట నడిచేది, జనం కాదు నీ కర్మల ఫలం..
Also Read: 100+ Telugu Sad Quotes: మీ కష్ట సమయాల్లో మీకు సహాయం చేసేవి
రెండు నాలుకలు ఉన్న పాము కన్నా, మన గురించి ఇతరుల దెగ్గర, రెండు రకాలుగా మాట్లాడే మనిషే చాలా ప్రమాదకరం..
మన జీవితంలో బాధకి కారణం ఏంటో తెలుసా..? కొన్ని విషయాలను, మనిషి అంగీకరించినంత తొందరగా, మనసు అంగీకరించకపోవడం..
కాలానికి భావాలు, భావోద్వేగాలు ఉండవు.. అవి ఉంటే కాలం గడవడం కష్టం..
కోటి అబద్ధాలు సృష్టించినా సత్యమనేది ఒకటే ఉంటుంది..
కలంతో రాసేవన్ని కథలే, కన్నీళ్లు చెప్పేవే నిజాలు..
నేస్తమవ్వటం అదేమంత బ్రహ్మప్రళయం కాదు..కాని దానిని చివరికంటా నిలుపుకోవటమే విశ్వమంత కష్టం..
నువ్వొస్తావన్న ఆశ లేదు.. ఎదురు చూసే ప్రేమ తప్పు.. చేరువవుతావన్న నమ్మకము లేదు.. నీలో కరిగిపోవాలన్న తపన తప్పు..
కొన్నిసార్లు వాదించి బాధ ఏడడం కన్నా… తప్ప నాదే అన్ని మౌనంగా ఉండడమే… చాలా మంచిది…!!
మనం బతకాలనుకున్నట్లుగా బతకగలగడం కన్నా గొప్ప విజయం జీవితంలో మరొకటి ఉండదు.
ఒక్కటి గుర్తు పెట్టుకో ఎంత కష్టం వచ్చినా సరే నవ్వుతూనే వుండు.. ఎంతలా అంటే నీ నవ్వుని చూసి నీ కష్టానికి కూడా విసుగురావాలి..
చిన్నప్పుడు అనుకున్నా నాకు అందరూ ఉన్నారని పెరుగుతున్నప్పుడు అనుకున్నా అందరూ దూరమైతే నేనుండలేనని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది చివరిదాకా నాకు నేనే తోడని.. నాకు ఎవ్వరూ లేరని..!!
ఎవరూ లేనప్పుడు నన్ను కావాలనుకునే వాళ్ళు కాదు నాకు కావాల్సింది… ఎందరిలో ఉన్నా కూడా నన్ను కావాలనుకునే వాళ్ళు నాకు కావాలి…