Table of Contents
Best Amma Quotes
ఈ ప్రపంచంలో మనల్ని చూడకముందే ప్రేమించే ఒకే ఒక స్త్రీ అమ్మ.
ఎలా ఉన్నా ఎక్కడ ఉన్న అమ్మ అమ్మే కదా అమ్మతనానికి రూపాలు ఉండవు అమ్మ నోటికి శాపాలు ఉండవు మనసున్నది అమ్మ మంచి కోరేది. అమ్మ.
మన ముందు ఒక మాట మన వెనుక ఒక మాట మాట్లాడేవారితో భౌతిక దూరం పాటించాలి వీరు కరోనా వచ్చిన వారి కంటే పెద్ద ప్రమాదకరం.
అమ్మ చదువు లేకపోయినా బుద్ధి చెప్పగలదు.. డబ్బు లేకపోయినా కడుపు నింపగలదు.. కాళ్లు లేకపోయినా నడక నేర్పగలదు.. కళ్లు లేకపోయినా జీవితానికి వెలుగు చూపగలదు.. అవరోధాలు లేనిది ఈ ప్రపంచంలో అమ్మ ప్రేమ ఒకటే..!
అమ్మ లేకపోతే జననం లేదు అమ్మ లేకపోతే గమనం లేదు అమ్మ లేకపోతే సృష్టిలో జీవంలేదు అమ్మే లేకపోతే అసలు సృష్టే లేదు – అమ్మ
అమృతం లాంటి ప్రేమను చూపేది.. అప్యాయత, అనురాగం పంచేది – అమ్మ
అమ్మా దీవేన ఒక వరం… అమ్మా ప్రేమ చల్లని నీడలాంది… అమ్మా లేని జీవిత గమ్యం వృధా అమ్మా ఆశీర్వాదం మనకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది. మాతృదేవో భవ…..
కూలి పని చేసుకునే వాడిని ఒక అమ్మాయి ప్రేమించిక పోవచ్చు కానీ నువ్వు శ్రమించి ఏ పని చేసినా ఒక అమ్మ మాత్రం వందశాతం నిన్ను ప్రేమిస్తుంది..
మహిళ చాలా అందమైన వ్యక్తిత్వం… సాక్ష్యం కావాలంటే మీ “అమ్మ” చూడండి.
Best Amma Quotes in Telugu
పసిపాప పెదవి కదిపితే, పలికే తొలిపలుకు, ఆనందంలో ఆవేదనలోనూ పిలిచే తొలి పిలుపు – అమ్మ
నువ్వు అరిచినా, అలిగినా అమ్మ కోపం క్షణం మాత్రమే నువ్వు గెలిచినా, ఓడినా అమ్మ ప్రేమ వరం ఎప్పుడు అమ్మ మన కోసం చేయడమేనా.. అమ్మ కోసం మనం కూడా ఏదో ఒకటి చేద్దాం.
పసిపాప పెదవి కదిపితే, పలికే తొలిపలుకు, ఆనందంలో ఆవేదనలోనూ పిలిచే తొలి పిలుపు – అమ్మ.
అన్నం కలిపి గోరు ముద్ద పెట్టేప్పుడు తన బిడ్డ ఉన్న ప్రేమ కూడా కలిపి పెడుతుంది. ఆ బిడ్డ ఎంతో ఇష్టంగా ఆ ముద్దలు తింటుంటే… ఆ బిడ్డ కడుపు నిండుతుందో లేదో కానీ, ఆ తల్లి కడుపు ఆనందంతో నిండిపోతుంది. అదీ.. అమ్మ ప్రేమంటే
ఏనాటిదో ఈ బంధం జన్మ జన్మల సంబంధం విడదీయలేనిదీ బంధం. తల్లీ బిడ్డల సంబంధం.
మా అమ్మపడే కష్టాన్ని చూసి నేను ఉదయనే లేచి తనకి కొంచమైనా సాయపడాలనుకుంటాను కానీ అది నాఆలోచనతోనే అగిపోతుందని, చాలా బాధపడతాను..
ఆత్మానురాగం ప్రేమ బాంధవ్యాలను పంచే అమ్మ అనురాగం మాటల్లో చెప్పలేనిది నవమాసాలు మోసి తన పిల్లల కోసం పరితపిస్తుంది అమ్మ.
అమ్మా అన్న పిలుపుకే ఏ తల్లి అయినా ఆరాటపడుతుంది గానీ తను ఒక బిడ్డకి జన్మనిస్తే తన అందం చెదిరిపోతుందని ఏ తల్లి అనుకోదు..
మన చిన్నప్పుడు స్కూల్కి వెళ్లే ప్రతిరోజు మన తల దువ్వి పక్క పాపిడి తీసి అద్దంలో మనకి చూపించి తను ఎంతో మురిసిపోయేదో, ఆ తల్లి…
అమ్మ దివిన వుంటే అంత శుభమే అమ్మ అశీసులు ఎప్పుడు మీతోనే ఉంటాయి.
నేను ఎంత దూరం ప్రయాణించిన క్షేమంగా ఇంటికి వెళ్తున్నాను అంటే, అది నా తల్లి దీవెన అని నేను అనుకుంటాను..
అమ్మంటే.. ప్రేమ అమ్మంటే.. ఆనందం అమ్ముంటేనే అన్నీ.
ఈ ప్రపంచం లో అమ్మ కంటే గొప్ప వారు ఎవరు లేరు అమ్మ లేనిదే జన్మ లేదు.
దేవుడు ప్రతి చోటా ఉండలేడు అందుకే తల్లిని సృష్టించాడు.